Telangana: హరీష్ రావువన్నీ అబద్ధాలే.. సభను పక్కదారి పట్టిస్తున్నారు!
Telangana: బియ్యం ఎగుమతులపై హరీష్ రావు చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టిపారేశారు.
Telangana: హరీష్ రావువన్నీ అబద్ధాలే.. సభను పక్కదారి పట్టిస్తున్నారు!
హైదరాబాద్: తెలంగాణ సివిల్ సప్లైస్ విభాగంలో బియ్యం ఎగుమతులపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. హరీష్ రావు చేస్తున్నవన్నీ సత్యదూరమైన వ్యాఖ్యలని, కేవలం సభను పక్కదారి పట్టించడానికే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
రికమండేషన్ వినకపోతే స్కామ్ అంటారా?
ఈ సందర్భంగా అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. "హరీష్ రావు ఏదైనా రికమండేషన్ చేస్తే అధికారులు వినకపోతే, వెంటనే దానిని స్కామ్ అని ముద్ర వేయడం ఆయనకు అలవాటుగా మారింది" అని ఎద్దేవా చేశారు. తెలంగాణ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా మొదటిసారిగా ఫిలిప్పీన్స్ దేశానికి బియ్యం ఎగుమతి చేశామని, ఇది రాష్ట్రానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
మధ్యవర్తుల ప్రమేయం లేదు:
ఈ బియ్యం ఎగుమతుల ప్రక్రియలో ఎలాంటి మధ్యవర్తులు లేరని, అత్యంత పారదర్శకంగా జరిగిందని మంత్రి స్పష్టం చేశారు. సివిల్ సప్లైస్ విభాగంలో ఎలాంటి స్కాం జరగలేదని, హరీష్ రావు ఆరోపణల్లో పస లేదని కొట్టిపారేశారు. ప్రతిపక్షం అనవసరంగా రాద్ధాంతం చేయకుండా వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు.