Malla Reddy: "రేవంత్‌ను సీఎం చేసింది నేనే.. మేమిద్దరం అన్నదమ్ములం": మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Malla Reddy: బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు.

Update: 2026-03-23 06:45 GMT

Malla Reddy: "రేవంత్‌ను సీఎం చేసింది నేనే.. మేమిద్దరం అన్నదమ్ములం": మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Malla Reddy: బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా చిట్ చాట్ లో ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకున్న సంబంధంపై మరియు సినిమాల్లో తనకు వచ్చిన ఆఫర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎప్పటిలాగే తనదైన మ్యానరిజంతో ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

రెడ్డి సంఘం మీటింగ్‌లో కీలక వ్యాఖ్యలు:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ.. "రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే" అంటూ మల్లారెడ్డి షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. గతంలో రెడ్డి సామాజికవర్గం మీటింగ్‌లో రేవంత్ తప్ప మరో పవర్‌ఫుల్ నాయకుడు లేడని తానే స్వయంగా చెప్పానని గుర్తు చేశారు. "ఎవరు అవునన్నా కాదన్నా.. నేను, రేవంత్ రెడ్డి అన్నదమ్ములమే" అని వ్యాఖ్యానిస్తూ ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చాటిచెప్పారు.

సినిమా ఆఫర్లు.. విలన్ రోల్ తిరస్కరణ:

మల్లారెడ్డికి ఉన్న పాపులారిటీ దృష్ట్యా సినిమాల్లోనూ ఆయనకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంలో విలన్ పాత్ర కోసం దర్శకుడు హరీష్ శంకర్ తనను సంప్రదించారని మల్లారెడ్డి వెల్లడించారు.

హరీష్ శంకర్ గంటన్నర పాటు బతిమాలినా తాను 'నో' చెప్పానని ఆయన అన్నారు. విలన్ పాత్రలో హీరో చేతిలో దెబ్బలు తినడం తనకు ఇష్టం లేదని సరదాగా పేర్కొన్నారు. తనకు సినిమాలో 'ముఖ్యమంత్రి' పాత్ర చేయాలని ఉందని, అటువంటి రోల్ వస్తే తప్పకుండా నటిస్తానని తన మనసులోని మాటను బయటపెట్టారు.

రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఉంటూనే, అటు సినిమాలపై తనకున్న మక్కువను మల్లారెడ్డి ఇలా వెల్లడించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News