Revanth Reddy: నెల ముందే ఎన్నికలు ఎంపీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం
Revanth Reddy: సంక్రాంతి తర్వాత ఎంపీ అభ్యర్థుల ప్రకటన
Revanth Reddy: నెల ముందే ఎన్నికలు ఎంపీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలు నెల రోజుల మందే రావచ్చని రేవంత్ అన్నారు. అలాగే, సంక్రాంతి తర్వాత కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎమ్మెల్సీ సీట్ల అంశం అధిష్టానం చూసుకుంటుందని.. నామినేటెడ్ పదవుల ఎంపిక బాధ్యత ఇంఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులదేనని ఆయన స్పష్టం చేశారు. నెల రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని క్లారిటీనిచ్చారు. మన పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడా లేదా అని కాకుండా, మన కోసం పనిచేసిన అందరికీ సంక్షేమ పథకాలు అందాల్సిందెనని తేల్చి చెప్పారు. మనం బీఫార్మ్ ఇచ్చిన నాయకుడి ద్వారానే ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలని, గ్రామసభల్లోనే లబ్ధిదారుల ఎంపిక జరగాలని రేవంత్‌రెడ్డి కామెంట్స్ చేశారు.