Maheshwar Reddy: హైడ్రా పేరుతో రేవంత్‌రెడ్డి హైడ్రామా చేస్తున్నారు
Maheshwar Reddy: హామీలను పక్కన పెట్టి హైడ్రా పేరుతో సంచలనం చేస్తున్నారు
Maheshwar Reddy: హైడ్రా పేరుతో రేవంత్‌రెడ్డి హైడ్రామా చేస్తున్నారు
Maheshwar Reddy: హైడ్రా పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రామా చేస్తున్నారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే దానంపై హైడ్రా కేసు పెట్టినప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. నిత్యం ఏదో ఒక సంచలనం చేయడమే రేవంత్‌రెడ్డి పని అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలను కూల్చివేయగలరా..? అని ప్రశ్నించారు. సెలబ్రిటీల నిర్మాణాలు కూల్చివేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. రుణమాఫీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే హైడ్రాతో హైప్ ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కబ్జా అయిన భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.