నా సోదరుడు తిరుపతి రెడ్డి మీలా కాదు... కేటీఆర్ కామెంట్స్‌పై తొలిసారిగా స్పందించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy about his brother Thirupati Reddy: బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలకు బదులిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తన సోదరుడు తిరుపతి రెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-01-26 14:45 GMT

Revanth Reddy about his brother Thirupati Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సోదరుడు తిరుపతి రెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను కొడంగల్ నియోజకవర్గ వాసులకు అందుబాటులో ఉన్నా లేకున్నా... తన సోదరుడు తిరుపతి రెడ్డి మీకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారని అన్నారు. కొడంగల్ నియోజవర్గంలో ఎవరికి, ఏ కష్టం వచ్చినా తన సోదరుడు తిరుపతి రెడ్డి వారికి అండగా నిలుస్తారని చెప్పారు. ఏ ఇంట్లో పెళ్లి ఉన్నా, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన అక్కడ ప్రత్యక్షమవుతారని తెలిపారు.

Full View

అయితే, తిరుపతి రెడ్డి ఏ పదవి లేకున్నా ప్రజలకు సేవ చేస్తున్నప్పటికీ కేటీఆర్ లాంటి కొంతమంది దానిని కూడా రాజకీయం చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... "మీ నాయిన కేసీఆర్ అధికారంలోకొస్తే మీరు మంత్రి అయ్యారు. మీ బావ హరీష్ రావు మంత్రి అయ్యారు. మీ చెల్లి కవిత ఎన్నికల్లో ఓడిపోయినా ఆమెను ఎమ్మెల్సీ చేశారు. మరో సమీప బంధువు సంతోష్‌ను రాజ్యసభ సభ్యుడిని చేశారు. ఇతరత్రా సమీప బంధువులు కూడా మంత్రులు అయ్యారు. లేదా ఇతర పదవులు తీసుకున్నారు. కానీ మీ తరహాలో తాను తన బంధువులకు మంత్రి పదవులు పంచిపెట్టలేదు కదా" అని అన్నారు.

కుటుంబంలోని వాళ్లందరూ, బంధువులు అందరూ పదవులు ఎంజాయ్ చేసింది మీరు. మీకు మాదిరి మేము పదవులు పంచుకోకుండా, ఏ పదవీ లేకున్నా ప్రజా సేవ చేస్తుంటే చూసి ఊర్వలేకపోతున్నారు అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి మరో ముఖ్యమంత్రిగా ఆధిపత్యం చెలాయిస్తున్నారని కేటీఆర్, హరీష్ రావు గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నేతలు చేసిన ఈ ఆరోపణలకు బదులిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. 

Tags:    

Similar News