Revanth Reddy: మేం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్‌లో కేసీఆర్ కుటుంబసభ్యులే ఉంటారు
Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 14 ఎంపీ సీట్లు గెలుస్తాం
Revanth Reddy: మేం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్‌లో కేసీఆర్ కుటుంబసభ్యులే ఉంటారు
Revanth Reddy: బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి... తెలంగాణలోని తమ ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మేం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్‌లో కేసీఆర్ కుటుంబసభ్యులు మినహా ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిర్వహించిన ‘ప్రజాదీవెన’ సభలో ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చింది పార్టీ కార్యకర్తలే అని చెప్పారు. ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో 9 స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలకు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.