Revanth Reddy: తెలంగాణలో అప్పుల పాలు చేశారు

Revanth Reddy: ట్రాన్స్‌కో.. జెన్‌కో సంస్థలను కేసీఆర్ నాశనం చేశారు

Update: 2023-02-10 08:50 GMT

Revanth Reddy: తెలంగాణలో అప్పుల పాలు చేశారు 

Revanth Reddy: తెలంగాణలో ట్రాన్స్ కో, జెన్ కో 60 వేల కోట్లు అప్పులు పాలయిందని, సీఎం కేసీఆర్ ఈ సంస్థలను నాశనం చేశాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా లో పాదయాత్ర చేసిన సందర‌్భంగా ఆయన మాట్లాడారు. కాసులకు కక్కుర్తి పడి కేంద్రం నుంచి కాకుండా ప్రైవేటు శక్తుల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేశాడని ఆయన ఆరోపించారు. పక్క రాష్ట్రం విద్యుత్ ఇస్తామంటే ఒప్పుకోని సీఎం కేసీఆర్ విద్యుత్‌ను ప్రైవేటు కంపెనీల వద్ద కొనుగోలు చేసి అప్పుల పాలు చేశాడని తీవ్ర పదజాలంతో ఆరోపించారు ఓ ఐఏఎస్ అధికారి ప్రైవేటు కొనుగోలుకు అంగీకరించకపోవడంతో ఆయనను బదిలీ చేశారని చెప్పారు. భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను నాశనం చేస్తున్నారని, ఎన్నికోట్లయినా కొనుగోలు చేస్తామని, 10 వేల కోట్లను గుజరాత్ కంపెనీకీ ఇచ్చి అప్పులు పాలు చేశారని అన్నారు.

Tags:    

Similar News