Revanth Reddy: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు.. మా హామీలపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి
Revanth Reddy: కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి..తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు
Revanth Reddy: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు.. మా హామీలపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి
Revanth Reddy: ప్రతిపక్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 50 రోజులు కూడా కాలేదని... కానీ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ హామీలపై అసహనం వ్యక్తం చేస్తున్నాయని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఫిబ్రవరి నెలలో మరో రెండు హామీలు ఇస్తామని స్పష్టం చేశారు. కేటీఆర్ గుంపు మేస్త్రి వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ చేసిన విధ్వంసాన్ని సరిచేసేందుకు వచ్చిన మేస్త్రినని ఆయన అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి వస్తున్నా... కాసుకోండి అని ప్రతిపక్షాలకు హెచ్చరికలు జారీ చేశారు.