Sathupalli: సత్తుపల్లి మున్సిపాలిటిలో బీఆర్ఎస్‌కు ముగ్గురు కౌన్సిలర్ల రాజీనామా

Sathupalli: వైస్ చైర్మన్‌ హోదాలో ఉండి ఏ పనులు చేయకపోతున్నా -సుజల రాణి

Update: 2023-07-01 06:49 GMT

Sathupalli: సత్తుపల్లి మున్సిపాలిటిలో బీఆర్ఎస్‌కు ముగ్గురు కౌన్సిలర్ల రాజీనామా  

Sathupalli: సత్తుపల్లి మున్సిపాలిటిలో బీఆర్ఎస్‌ పార్టీకి ముగ్గురు కౌన్సిలర్ల రాజీనామా చేశారు. వైస్ చైర్మన్ తోట సుజల రాణి, 16వ వార్డు కౌన్సిలర్ రాంబాబు, 20వ వార్డు కౌన్సిలర్ పద్మ జ్యోతిలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్‌లో చేరి అనేక ఇబ్బందులు ఎదుర్కొటున్నామని వైస్ చైర్మన్ సుజల రాణి ఆవేదన వ్యక్తం చేశారు. వైస్ చైర్మన్‌ హోదాలో ఉండి ఏ పనులు చేయకపోతున్నామని తెలిపారు. కనీసం ప్రోటో కాల్‌ పాటించడం లేదని... ఏ పనికోసం అడిగినా అవమానిస్తున్నారని అన్నారు. కనీస సమాచారం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ... అందుకే పార్టీ సభ్యత్వానికి రాజీమానా చేస్తున్నట్లు సుజల రాణి తెలిపారు. 

Tags:    

Similar News