SLBC: టన్నెల్ ప్రమాదం.. కొనసాగుతోన్న సహాయక చర్యలు
SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 11 కిలో మీటర్ల దూరం వరకు లోకో ట్రైన్‌లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వెళ్లాయి.
SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 11 కిలో మీటర్ల దూరం వరకు లోకో ట్రైన్‌లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వెళ్లాయి. అక్కడి నుంచి మూడు అడుగుల మేర నీరు నిలిచి ఉన్నాయి. 11 కిలో మీటర్ నుంచి 14 కిలో మీటరు వరకు నడుచుకుంటూ ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వెళ్లారు. టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకున్నాయి.
ప్రమాద సమయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ వెనుక భాగం దెబ్బతిన్నాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ రెండు వైపులా పూర్తిగా మట్టి, బురద నిండిపోయాయి. ప్రమాద సమయంలో టీబీఎం 80 మీటర్ల వెనుకకు వచ్చిందని ఏజెన్సీ తెలిపింది. ఎంతో కష్టపడి టీబీఎం ముందు వైపునకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకున్నా్యి. నీరు, మట్టి, బురద తోడేవరకు చిక్కుకున్న వారిని బయటకు తీయలేని పరిస్థితి ఉంది.