Jangaon: ఖననం చేసిన 35 రోజుల తర్వాత మృతదేహానికి రీపోస్టుమార్టం
Jangaon: సుభద్ర మృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలు
Jangaon: ఖననం చేసిన 35 రోజుల తర్వాత మృతదేహానికి రీపోస్టుమార్టం
Jangaon: జనగామ జిల్లా సదాశివపేటలో ఖననం చేసిన మహిళా మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించనున్నారు. గత ఏడాది సుభద్ర అనే మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. సుభద్ర మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో.. ఖననం చేసిన 35 రోజుల తర్వాత మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. అప్పట్లో ఎలాంటి ఆధారాలు లభించలేదని నివేదిక అందించారు.
అయితే ఇటీవల రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య హత్య కేసు విచారణ సందర్భంగా ప్రధాన నిందితుడు అంజయ్యను పోలీసులు విచారించారు. ఎంక్వైరీలో సుభద్రను హత్య చేసినట్లు అంజయ్య అంగీకరించడంతో మరోసారి రీపోస్టుమార్టం నిర్వహించనున్నారు.