ఉచిత మధుమేహ వ్యాధి నిర్ధారణ శిబిరానికి విశేష స్పందన

గంగాధరలయన్స్ క్లబ్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రామడుగు మండల వెలిచాల గ్రామ పంచాయతీ ముందు నిర్వహించారు.

Update: 2019-12-02 07:02 GMT
అద్యక్షులు లక్ష్మారెడ్డి, లయన్స్ క్లబ్ కార్యదర్శి ఎడ్ల శ్రీనివాస్, ఎర్రం లక్ష్మన్, సంజీవరెడ్డి, విజయేందర్రెడ్డి

రామడుగు: గంగాధరలయన్స్ క్లబ్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రామడుగు మండల వెలిచాల గ్రామ పంచాయతీ ముందు ఈ రోజు నిర్వహించిన ఉచిత మధుమేహ వ్యాధి నిర్ధారణ పరీక్షా శిబిరానికి విశేష స్పందన లభించింది. గ్రామంలో 150 మందికి పరీక్షలు నిర్వహించగా, అందులో 20 మందికి షుగర్ వ్యాది ఉన్నట్టు నిర్ధారించారు. తర్వాత షుగర్ వ్యాధి పై అవగాహన చేసి, కరపత్రాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో అద్యక్షులు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... దూమ పానీయాలు మానుకోవాలని సూచించారు. సరియైన సమయానికి ఆహారం తీసుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి ఎడ్ల శ్రీనివాస్, ఎర్రం లక్ష్మన్, సంజీవరెడ్డి, విజయేందర్రెడ్డి, గాలి శ్రీనివాస్, శ్రీధర్, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు. 


Tags:    

Similar News