Dharmapuri Arvind: రామమందిరం పునఃనిర్మాణం 500 ఏళ్లనాటి హిందువుల కల

Dharmapuri Arvind: జనవరి 22న ఈ మహత్తర కార్యక్రమం నెరవేరబోతుంది

Update: 2024-01-18 07:45 GMT

Dharmapuri Arvind: రామమందిరం పునఃనిర్మాణం 500 ఏళ్లనాటి హిందువుల కల

Dharmapuri Arvind: అయోధ్యలో రామమందిరం పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆలయాల శుద్ధికరణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇందూర్ పట్టణంలో దశాబ్దాల చరిత్ర కలిగిన ఖిల్లా రామాలయాన్ని శుద్ధి చేశారు ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ. అయోధ్య రామమందిరం పునఃనిర్మాణం 500 ఏళ్లనాటి హిందువుల కల అని అన్నారు ధర్మపురి అర్వింద్. జనవరి 22న ఈ మహత్తర కార్యక్రమం నెరవేరబోతుందని, ఎంతో మంది కరసేవకులు, హిందువులు తమ ప్రాణాలను కోల్పోయారని అన్నారు. ఇందూరులో ఉన్న హిందూ బంధువులు అందరూ తమ, తమ ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలని శుభ్రం చేసుకోవాలని కోరారు ధర్మపురి అర్వింద్.


Tags:    

Similar News