Raja Singh: రూ.500 నోటుపై రాముడి ఫొటో ముద్రించాలని డిమాండ్
Raja Singh: ఈ భూములను మహారాష్ట్ర సర్కార్ రిలీజ్ చేయాలి
Raja Singh: రూ.500 నోటుపై రాముడి ఫొటో ముద్రించాలని డిమాండ్
Raja Singh: మహారాష్ట్రలో ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 5వందల రూపాయల నోటుపై రాముడి ఫొటో ముద్రించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అమెరికా, థాయ్‌లాండ్, యూరప్ సహా పలు దేశాల్లో.. కరెన్సీపై హిందూ దేవుళ్ల ఫొటోలు ముద్రించారని అన్నారు. 5వందల రూపాయల నోటుపై రాముడి ఫొటో ముద్రించాలని 100 కోట్ల మంది హిందువుల డిమాండ్ చేస్తున్నారని రాజాసింగ్ అన్నారు. దేశంలో వక్ఫ్ బోర్డు పేరిట ఉన్న భూములను రిలీజ్ చేయాలని రాజాసింగ్ అన్నారు.
దేశ విభజన సమయంలో మనదేశ ప్రజలను హత్య చేసిన వారి.. ఆస్తులు కాపాడేందుకు నెహ్రూ వక్ఫ్ చట్టం తెచ్చాడని రాజాసింగ్ ఆరోపించారు. మహారాష్ట్రలోనే వక్ఫ్‌బోర్డ్ పేరుతో 10 లక్షల ఎకరాలు ఉన్నాయని.. 2009 వరకు 4 లక్షల ఎకరాలు మాత్రమే ఉండేవని అన్నారు. ఈ వక్ఫ్ బోర్డు భూములను మహారాష్ట్ర సర్కార్ రిలీజ్ చేయాలని రాజాసింగ్ చేశారు.