వానకాలం పంటసాగు ప్రణాళికపై సమీక్ష.. తెలంగాణలో వానకాలం సాగు 1.42 కోట్ల ఎకరాలు...

Telangana News: *70 నుంచి 75 లక్షల ఎకరాల్లో పత్తి *50 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు

Update: 2022-04-17 03:50 GMT

వానకాలం పంటసాగు ప్రణాళికపై సమీక్ష.. తెలంగాణలో వానకాలం సాగు 1.42 కోట్ల ఎకరాలు...

Telangana News: వానాకాలంలో రైతులు పండించే పంటలపై అవగాహన కల్పించడానికి తెలంగాణ సర్కార్‌ సిద్ధమైంది. మే నెలలో క్షేత్రస్థాయిలో పర్యటించి వానాకాలం పంటల ప్రణాళికపై క్లస్టర్ల వారీగా రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పంటల ప్రణాళికలపై జిల్లాల వారీగా ఏఈవోలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.

రాష్ట్రంలో వచ్చే వానకాలంలో 70-75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేపట్టాలని, అందుకు వేయి 332 క్లస్టర్లను గుర్తించాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులకు సూచించారు. వెయ్యికి పైగా క్లస్టర్లలో 50లక్షల ఎకరాల్లో వరిని, 82 క్లస్టర్ల పరిధిలో 15 లక్షల ఎకరాల్లో కందిని, 11.5 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వెల్లడించారు. ఆయా పంటలకు కావాల్సిన విత్తనాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

పచ్చిరొట్ట ఎరువులను ప్రోత్సహించి భూసారం పెంచేదిశగా రైతులను సన్నద్ధంచేయాలని తెలిపారు. మే నెలలో వీటిని రైతులకు పంపిణీ చేయాలని, కల్తీ లేని నాణ్యమైన విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకోవాలని.. అందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పంటల ప్రణాళిక ప్రకారం ఎరువులను సిద్ధంగా ఉంచాలని, మే నెలాఖరు నాటికి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

Tags:    

Similar News