Rains: తెలంగాణలో మూడురోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ

Rains: తెలంగాణలో మూడురోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ

Update: 2023-07-12 10:46 GMT

Rains: తెలంగాణలో మూడురోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ

Rains: తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలతో పాటు ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో భారీ వర్షాలు పడతాయని వివరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.

ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం పడుతోంది. నిన్న రాత్రి మొదలైన వర్షం....ముసురు, చిరు జల్లులతో పడుతోంది. చాలా ఏరియాల్లో వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, సహా సిటీ శివారు ప్రాంతాల్లో వర్షం పడింది. సిటీలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, కోటి ఏరియాల్లో వాన కురిసింది. ఇటు సిటీ శివారు ప్రాంతాల్లోని రాజేంద్రనగర్, మైలార్ దేవ్ పల్లి, అత్తాపూర్, బండ్లగూడ, హిమాయత్ సాగర్, నార్సింగి, కోకాపేట ఏరియాల్లో వర్షం పడింది. దీంతో వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రజలను అలెర్ట్ చేశారు. 

Tags:    

Similar News