Weather Report: చల్లటి కబురు.. తెలంగాణకు వర్ష సూచన

Weather Report: నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్

Update: 2024-03-18 04:00 GMT

Weather Report: చల్లటి కబురు.. తెలంగాణకు వర్ష సూచన

Weather Report: కొద్ది రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వేళ తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన ఇచ్చింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, నల్గొండ, వికారాబాద్‌, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట జిల్లాల్లో కురుస్తాయని తెలిపింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక వీదుగా ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతున్నట్లు వెల్లడించింది.

నిన్న 9 జిల్లాల్లో వందకుపైగా ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్లు వాతావారణశాఖ తెలిపింది. అత్యధికంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలాల్లో 5 సెం.మీ., కరీంనగర్‌లో 4 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది. కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో నిన్న వడగళ్ల వానలు కురిశాయి. వర్షాలతో రాష్ట్రమంతటా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు తగ్గుముఖం పట్టాయి.

Tags:    

Similar News