Telangana: వర్షానికి తడిసి ముద్దయిన పంట.. ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు

Telangana: గద్వాల జిల్లా అలంపూర్‌లో ఘటన

Update: 2023-03-17 04:57 GMT

Telangana: వర్షానికి తడిసి ముద్దయిన పంట.. ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు

Telangana: రైతు ఆరుగాలం శ్రమిస్తే చేతికొచ్చిన మిర్చి, పప్పు, శనగ పంటలు వర్షానికి తడిసిముద్దయ్యాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్‌లో రైతులు వాణిజ్య పంటలైన పత్తి, మిరప పంటలను సాగు చేస్తుంటారు. కాగా నిన్న కురిసిన భారీ వర్షంతో తెంపి కల్లాలలో పెట్టుకున్న మిర్చిపంట తడిసి ముద్దయింది. కొందరు రైతులు మిర్చిపంటపై కవర్లు కప్పి కాపాడుకునే ప్రయత్నం చేసినా..పొలంలో కింద పారిన నీటితో తడిసి ముద్దయింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News