Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. రాగల రెండు గంటల్లో హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన
Telangana Rain Alert: తెలంగాణలో ఈరోజు, రేపు రెయిన్ అలర్ట్‌నిచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. రాగల రెండు గంటల్లో హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన
Telangana Rain Alert: తెలంగాణలో ఈరోజు, రేపు రెయిన్ అలర్ట్‌నిచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ముఖ్యంగా రాగల రెండు గంటల్లో హైదరాబాద్‌కు భారీ వర్షసూచన చేసింది. దీంతో ఇప్పటికే జీహెచ్‌ఎంసీ అధికారులు అలెర్టయ్యారు.
మరోవైపు జనగామ, కామారెడ్డి, మెదక్, మల్కాజ్‌గిరి, సిరిసిల్ల, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, భువనగిరి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్ జిల్లాలకు వాతావరణశాఖ వర్షసూచననిచ్చింది. రేపు కూడా ఈ జిల్లాలకు వర్ష సూచన ఉన్నందున ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.