Rain Alert: తెలంగాణలో పలు జిల్లాలకు వర్షసూచన

ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, నిజామాబాద్, జనగామ.. సిద్దిపేట, యాదాద్రి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో వర్షాలు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తిలో మోస్తరు వానలు నారాయణపేట, జోగులాంబ గద్వాలలో మోస్తరు వర్షాలు

Update: 2025-11-04 05:41 GMT

Rain Alert: తెలంగాణలో పలు జిల్లాలకు వర్షసూచన

తెలంగాణలో ఇవాళ విభిన్న వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, నిజామాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున.. ప్రజలు సురక్షిత ప్రాంతాలలో ఆశ్రయం తీసుకోవాలన్నారు. ఇక రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలలో అక్కడకక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.  

Tags:    

Similar News