Railway SP Anuradha: వాట్సాప్ గ్రూప్‌లు పెట్టి పక్కా ప్లాన్ చేశారు
Railway SP Anuradha: కుట్ర వెనుక కోచింగ్ సెంటర్ల పాత్ర ఉంది
Railway SP Anuradha: వాట్సాప్ గ్రూప్‌లు పెట్టి పక్కా ప్లాన్ చేశారు
Railway SP Anuradha: అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసానికి పాల్పడిన వారిలో ఇప్పటివరకు 46 మందిని అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్సీ అనురాధ వెల్లడించారు. ఈ ఘటనలో మిగిలిన వారికోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఆర్మీ అభ్యర్థుల వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన మెసేజ్‌ల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేసి అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తున్నామన్నారు. పోలీసులు, ప్రయాణికులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారని, రెండు వేల మంది ఆందోళనల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు.
అభ్యర్థులను రెచ్చగొట్టిన కోచింగ్ సెంటర్లను గుర్తించామని ప్రకటించారు. వాట్సాప్ గ్రూపుల్లో చర్చించి దాడికి పాల్పడ్డారని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్లలో.. అరెస్టైన వారంతా తెలంగాణ వాళ్లేనని వెల్లడించారు. రైల్వే యాక్ట్ 150 కింద నిందితులకు యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే చర్యలు తప్పవని అనురాధ హెచ్చరించారు.