రాయదుర్గం చెరువులో చేపలు మృత్యువాత.. చెరువులోకి విష రసాయనాలు...

Rai Durg Lake: *చెరువుపైనే ఆధారపడిన 2వేల కుటుంబాలు *తమకు న్యాయం చేయాలని జాలర్ల డిమాండ్‌

Update: 2022-04-01 07:16 GMT

రాయదుర్గం చెరువులో చేపలు మృత్యువాత.. చెరువులోకి విష రసాయనాలు...

Rai Durg Lake: హైదరాబాద్‌ శివారు ప్రాంతంలోని రాయదుర్గంలోని ఓ చెరువలో వేలాది చేపలు మృత్యువాత పడ్డాయి. విష రసాయనాలు చెరువులోకి చేరడంతోనే చేపలు మృత్యువాత పడ్డాయని జాలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమీపంలోని పరిశ్రమలు వ్యర్థ రసాయనాలను కాల్వల ద్వారా విడుదల చేయడంతోనే.. అవి చెరువులోకి వచ్చి ఉంటాయని జాలర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చేపల వేటపైనే ఆధారపడి రెండువేల జాలర్ల కుటుంబాలు జీవిస్తున్నాయని.. తమ బతుకులు ప్రశ్నార్థకంగా మారాని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని జాలర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News