Rahul Gandhi: తెలంగాణ రాజకీయాలపై రాహుల్ గాంధీ ఆరా

Rahul Gandhi: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రాహుల్‌ను కలిసిన కాంగ్రెస్‌ నేతలు

Update: 2023-04-18 04:40 GMT

Rahul Gandhi: తెలంగాణ రాజకీయాలపై రాహుల్ గాంధీ ఆరా

Rahul Gandhi: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ తెలంగాణ రాజకీయాలపై ఆరా తీశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీల పనితీరు.. కాంగ్రెస్‌ కార్యక్రమాలతో పాటు తెలంగాణలో అధికారంలోకి రావడానికి అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించారు. బీఆర్ఎస్‌‌పై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చే అంశాలపై చర్చించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళ్తున్న రాహుల్‌.. శంషాబాద్‌లో దిగారు. ఎయిర్‌పోర్టులో ఏఐసీసీ ఇంఛార్జ్ ఠాక్రే, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు.. రాహుల్‌ గాంధీకి స్వాగతం పలికారు. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలపై అరగంటకు పైగా నేతలతో చర్చించారు రాహుల్‌. బీజేపీ జాతీయ నేతలు తెలంగాణలో పర్యటిస్తుండంతో.. రాష్ట్రంలో బీజేపీ ఎలాంటి ప్రభావం చూపబోతుందనే అంశాలపై ఆరా తీశారు. అయితే ఈ సమావేశంలో పొత్తు ప్రస్తావన రాగా.. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌తో పొత్తు ఉండబోదని రాహుల్‌ గాంధీ చెప్పినట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News