Raghunandan Rao: కడియం శ్రీహరికి కౌంటర్ ఇచ్చిన రఘునందన్ రావు
Raghunandan Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత రఘునందన్ రావు ఖండించారు.
Raghunandan Rao: కడియం శ్రీహరికి కౌంటర్ ఇచ్చిన రఘునందన్ రావు
Raghunandan Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత రఘునందన్ రావు ఖండించారు. ఆయన మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్య ప్రక్రియకే పూర్తి విఘాతం కలిగించేలా కనిపిస్తున్నాయని రఘునందన్ రావు అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బొటాబొటిన స్థానాలు గెలుచుకుందని, ఏడాదిలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ, ఎంఐఎం పార్టీలను కలుపుకొని ఏర్పాటవుతుందనటం పట్ల భారతీయ జనతా పార్టీకు ఎలాంటి సంబంధ లేదన్నారు. ఎంఐఎం పార్టీతో బీఆర్ఎస్ అంటకాగితే... తమకు సంబంధం లేదన్నారు. బీజేపీ మాత్రం ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందని పేర్కొన్నారు. ఎంఐఎం పార్టీతో అంటకాగే.. ఏ పార్టీతోనూ బీజేపీ కలవదు భవిష్యత్‌లోనూ కలవబోదని.. రఘునందన్ రావు స్పష్టం చేశారు.