Raghunandan Rao: నాకు ప్రస్తుతం ఉన్న భద్రతను రెట్టింపు చేయాలని కోరా
Raghunandan Rao: నేనిచ్చిన దరఖాస్తుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగాను
Raghunandan Rao: నాకు ప్రస్తుతం ఉన్న భద్రతను రెట్టింపు చేయాలని కోరా
Raghunandan Rao: తనకు ప్రస్తుతమున్న భద్రతను రెట్టింపు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పోలీసులను కోరారు. ఈ విషయంలో గతేడాదే భద్రత పెంచాలని దరఖాస్తు చేశానని.. మళ్లీ ఈ రోజు మరోసారి దరఖాస్తు ఇచ్చినట్లు తెలిపారు. అయితే డీజీపీ అందుబాటులో లేకపోవడంతో అడిషనల్ డీజీపీకి మరోసారి దరఖాస్తు అందించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు తానిచ్చిన దరఖాస్తుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగితే.. అధికారుల నుంచి మౌనమే సమాధానంగా వచ్చిందన్నారు. దీంతో పాటు 2014 నుంచి ఇప్పటివరకు పోలీస్ శాఖ కొనుగోలు చేసిన వాహనాల గురించి సమాచార హక్కు చట్టం ద్వారా అడిగానని రఘునందన్ తెలిపారు.