Rachakonda CP: సీపీని అడ్డుకున్న మహిళా కానిస్టేబుల్.. రివార్డుతో మెచ్చుకున్న పోలీస్ బాస్..

Rachakonda CP Chouhan: తెలంగాణలో ప్రస్తుతం టెన్త్ పరీక్షలు జరుగుతున్నాయి.

Update: 2023-04-06 11:48 GMT

Rachakonda CP: సీపీని అడ్డుకున్న మహిళా కానిస్టేబుల్.. రివార్డుతో మెచ్చుకున్న పోలీస్ బాస్..

Rachakonda CP Chouhan: తెలంగాణలో ప్రస్తుతం టెన్త్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్ష పత్రాలు లీకేజీ కలకలం నేపథ్యంలో ఎల్బీనగర్‌లోని పరీక్ష కేంద్రానికి రాచకొండ పోలీస్ కమిషనర్ చౌహాన్ తనిఖీ చేయడానికి వెళ్లారు. ఆయన చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని పరీక్షా కేంద్రంలోకి వెళ్తుండగా అక్కడ విధుల్లో ఉన్న కల్పన అనే మహిళా కానిస్టేబుల్ అడ్డుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. ఉన్నతాధికారిని ఆపడం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. అయితే, తన విధుల్లో భాగంగానే ఆమె అలా చేసిందంటూ సీపీ చౌహాన్ ఆమెను అభినందించారు. ఆమెకు మొబైల్ ఫోన్ ఇచ్చి పరీక్షా కేంద్రంలోకి తనిఖీకి వెళ్లారు. అంతేకాదు, డ్యూటీని సిన్సియర్ గా నిర్వహించిన ఆమెను అభినందించారు. ఆమెకు రివార్డును అందజేశారు. ఏ అధికారి వచ్చినా ఇలాంటి పటిష్ట బందోబస్తు నిర్వహించాలని ఆయన సూచించారు.

Tags:    

Similar News