PM Modi: ప్రధాని మోడీ వరంగల్ పర్యటనకు శరవేగంగా ఏర్పాట్లు
PM Modi: ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు సిద్దమవుతున్న కాషాయదళం
PM Modi: ప్రధాని మోడీ వరంగల్ పర్యటనకు శరవేగంగా ఏర్పాట్లు
PM Modi: ప్రధాని మోడీ వరంగల్ పర్యటనకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. రైలు వ్యాగన్ల తయారీ కేంద్రంతో పాటు పలు జాతీయ రహదారులకు ఈ పర్యటనలో ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. సభ నిర్వహించే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు సభకు భారీగా జనసమీకరణ చేసి తమ సత్తా చాటేందుకు కాషాయదళం సన్నద్ధమైంది. ప్రధాని ఈ నెల 8న వరంగల్‌కు రానుండటంతో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
ఉదయం సికింద్రాబాద్ హకీంపేట్ విమానాశ్రయం నుంచి వరంగల్‌లోని మామునూర్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగి.. అక్కడి నుంచి నేరుగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. మోడీ రాకను పురస్కరించుకుని మామునూరు విమానాశ్రయంలో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మోడీ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు.