Puvvada Ajay Kumar: రాపర్తినగర్‌లో విస్తృతంగా పర్యటించిన పువ్వాడ అజయ్

Puvvada Ajay Kumar: వాడ వాడ పువ్వాడ కార్యక్రమం ప్రారంభం

Update: 2023-01-06 05:22 GMT

Puvvada Ajay Kumar: రాపర్తినగర్‌లో విస్తృతంగా పర్యటించిన పువ్వాడ అజయ్

Puvvada Ajay Kumar: స్థానిక సమస్యల తక్షణ పరిష్కారం కోసం రూపొందించిన వాడ వాడ పువ్వాడ కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈరోజు 50వ డివిజన్ రాపర్తి నగర్ లో విస్తృతంగా పర్యటించారు. నేరుగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గడపను తట్టి వారి సమస్యలను తెలుసుకొని అక్కడే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందుతున్నాయా లేదా అని స్వయంగా పర్యవేక్షించే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కలిగిందన్నారు.

Tags:    

Similar News