ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన
*TSLRB విడుదల చేసిన ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణ
ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన
Hyderabad: హైదరాబాద్ ఓయూలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. TSLRB విడుదల చేసిన ఫలితాల్లో అవకతవకలు జరిగాయని వారు ఆరోపిస్తున్నారు. ప్రశ్నపత్రంలో తప్పుగా ఇచ్చిన 22 ప్రశ్నలకు మార్కులు కలపాలని డిమాండ్ చేస్తూ.. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ధర్నాకు దిగారు అభ్యర్థులు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని.. లేనిపక్షంలో డీజీపీ ఆఫీస్ ముట్టడికి వెళ్తామని హెచ్చరిస్తున్నారు అభ్యర్థులు.