Banjara Hills: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం
Banjara Hills: సయ్యద్ యూసుఫ్ బాషాలపై కేసులు నమోదు
Banjara Hills: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం
Banjara Hills: హైదరాబాద్‌లో మసాజ్ సెంటర్ల గలీజ్ దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బంజారాహిల్స్‌లోని మసాజ్ సెంటర్స్‌లో వ్యభిచారం గుట్టును రట్టు చేశారు పోలీసులు. ది వెల్వెట్ స్పా, హెవెన్ స్పా వ్యభిచారం చేస్తున్నట్లు గుర్తించారు. మసాజ్ పేరుతో యువకులకు వల వేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు స్పా సెంటర్లను సీజ్ చేశారు. నిర్వాహకులు, విటులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మొత్తం 17 మంది యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. నిర్వాహకులు నీలిమ, కార్తీక్, జ్యోతి బజాజ్... సయ్యద్ యూసుఫ్ బాషాలపై కేసులు నమోదు చేశారు.