PM Modi: నేడు సికింద్రాబాద్, సంగారెడ్డిలలో మోడీ పర్యటన

PM Modi: బహిరంగ సభలో ప్రసంగించనున్న మోడీ

Update: 2024-03-05 02:32 GMT

PM Modi: తెలంగాణలో ప్రధాని మోడీ రెండోరోజు పర్యటన.. పటాన్‌చెరు‌లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు  

PM Modi: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు‌ ప్రాంతాల్లో ప్రధాని మోడీ ఇవాళ పర్యటించనున్నారు. పటాన్‌చెరు శివార్లలోని పటేల్‌గూడలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు మోడీ వస్తారు. తొలుత అధికారిక వేదికపై వివిధ కార్యక్రమాలకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. తర్వాత సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికపై ప్రసంగిస్తారు. మెదక్‌, జహీరాబాద్ లోక్‌సభ సీట్లతో పాటు సమీపంలోని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టేలా ప్రధాని సభను నిర్వహిస్తారు.

1,298 కోట్లతో ఎన్‌హెచ్‌-65పై సంగారెడ్డి చౌరస్తా నుంచి మదీనాగూడ వరకు 31కిలోమీటర్ల మేర ఆరు లైన్ల విస్తరణ పనులకు మోడీ శంకుస్థాపన చేస్తారు. 399 కోట్లతో ఎన్‌హెచ్‌-765డిపై మెదక్-ఎల్లారెడ్డి మధ్య రెండు లైన్ల హైవే విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. 3,338 కోట్లతో నిర్మించిన పారాదీప్-హైదరాబాద్‌ గ్యాస్‌ పైప్‌లైన్, 400 కోట్లతో చేపట్టిన సివిల్‌ ఏవియేషన్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ను జాతికి అంకితం ఇవ్వనున్నారు మోడీ.

1,409 కోట్లతో నిర్మించిన ఎన్‌హెచ్‌-161లోని కంది-రామసానిపల్లె సెక్షన్‌లో 4 వరుసల జాతీయ రహదారిని మోడీ ప్రారంభించనున్నారు. 323 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఎన్‌హెచ్‌-161 మిర్యాలగూడ-కోదాడ సెక్షన్ 4 వరుసల జాతీయ రహదారిని ప్రారంభించనున్నారు. 1,165 కోట్లతో హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లలో 103 కిలోమీటర్ల పొడవున చేపట్టిన ఎంఎంటీఎస్ ఫేజ్-2 ప్రాజెక్టు , ఘటకేసర్-లింగంపల్లి మధ్య కొత్త ఎంఎంటీఎస్‌ రైలును మోడీ ప్రారంభించనున్నారు. 

Tags:    

Similar News