Old City Metro: పాతబస్తీ మెట్రో పనులకు ముందడుగు

Old City Metro: కేసీఆర్‌ సూచన మేరకు సన్నాహక పనులు ప్రారంభం

Update: 2023-07-17 02:14 GMT

Old City Metro: పాతబస్తీ మెట్రో పనులకు ముందడుగు

Old City Metro: పాతబస్తీలో మెట్రో పనుల దిశగా అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. కేసీఆర్‌ సూచన మేరకు సన్నాహక పనులు ప్రారంభించారు. గ్రీన్‌ లైన్‌ను ఎంజీబీఎస్‌ నుంచి ఐదున్నర కిలోమీటర్ల మేర పొడిగించనున్నారు. ఇందుకు రూట్‌మ్యాప్‌ను కూడా సిద్ధం చేశారు అధికారులు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమ వరకు పొడిగించనున్న గ్రీన్‌లైన్‌లో సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్‌, శాలిబండ, శంషీర్ గంజ్‌, ఫలక్‌నుమా స్టేషన్లతో మెట్రో లైన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్గంలో 103 మత పరమైన కట్టడాలు, వెయ్యి ప్రైవేట్ ఆస్తులను గుర్తించారు. దీంతో ప్రైవేట్ ఆస్తులున్న వారికి భూ సేకరణ నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News