ఎల్బీనగర్‌లోని మన్సూరాబాద్‌లో ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్

Hyderabad: ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి

Update: 2023-02-14 08:44 GMT

ఎల్బీనగర్‌లోని మన్సూరాబాద్‌లో ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్

Hyderabad: ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్లో బీజేపీ పార్టీ ప్రజాగోస భరోసా కార్నర్ మీటింగ్ చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి పాల్గొన్నారు. 24గంటల పేరు చెప్పి ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని విమర్శించారు ప్రేమేందర్‌రెడ్డి. తెలంగాణలో అవినీతి పాలన జరుగుతోందని ఆరోపించారు. తప్పుడు హామీలు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని సామ రంగారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పోయి బీజేపీ పాలన వస్తుందని తెలిపారు.

Tags:    

Similar News