పొన్నాల లక్ష్మయ్యకి తప్పిన ప్రమాదం.. కారు ముందు భాగం ధ్వంసం..

Update: 2019-10-28 17:40 GMT

మాజీ పీసీసీ అధ్యక్షుడు,కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకి ప్రమాదం తప్పింది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 వద్ద ఆగి ఉన్న పొన్నాల లక్ష్మయ్య కారుని ఓ షూటింగ్ కి సంబంధించిన వాహనం వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటన ఈరోజు(సోమవారం) రాత్రి చోటు చేసుకుంది.. ప్రమాదం జరిగిన వెంటనే పొన్నాల పోలీసులుకి ఫిర్యాదు చేశారు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. పొన్నాల లక్ష్మయ్య కారు ముందు భాగం మాత్రం ధ్వంసం అయింది.. ఈ వార్త తెలియగానే ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందారు. కానీ ఇందులో ఆయనకి ,ఆయన మనవడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు..



 


Tags:    

Similar News