రాజ్యసభలో మోడీవ్యాఖ్యలు అభ్యంతరకరం
Ponnala Lakshmaiah: తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని మోడీ ఒప్పుకున్నందుకు ధన్యావాదాలు
రాజ్యసభలో మోడీవ్యాఖ్యలు అభ్యంతరకరం
Ponnala Lakshmaiah: రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే సమయంలో ప్రధానమంత్రి మోడీ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మోడీ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస పార్టీ దేశాన్ని ఉద్ధరించడంవల్లే సుధీర్ఘకాలం పాలించిదనే అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడిందన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని ప్రధానమంత్రి ఒప్పుకున్నందుకు పొన్నాల ధన్యవాదాలు తెలిపారు. స్వాతంత్ర్యం సాధించేందుకు పోరాడిన పార్టీని కించపరచే విధంగా మాట్లాడటం సరికాదన్నారు.