Ponguleti Srinivasa Reddy: కేసీఆర్ పతనం ప్రారంభమైంది
Ponguleti Srinivasa Reddy: గత ఐదేళ్లలో మునిగేపల్లిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు
Ponguleti Srinivasa Reddy: కేసీఆర్ పతనం ప్రారంభమైంది
Ponguleti Srinivasa Reddy: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత ఎమ్మెల్యే మునిగేపల్లి అభివృద్ధి కోసం ఐదేళ్లలో తట్టెడు మట్టి కూడా పోయలేదని విమర్శించారు. TSPSC పరీక్షలకు ముందే బీఆర్ఎస్ మంత్రులు, సీఎం అనుచరులు పేపర్లు అమ్ముకున్నారన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి చేసి సంపాదించిన లక్ష కోట్లతో కేసీఆర్ రేవంత్ రెడ్డినీ.. తనను ఓడించాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్ పతనం ప్రారంభమైందన్న ఆయన.. త్వరలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.