Ponguleti Srinivas: అభివృద్ధి పనులపై ఆరా.. వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమావేశమైన పొంగులేటి
Ponguleti Srinivas: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మంత్రి పొంగులేటి సమీక్ష సమావేశం
Ponguleti Srinivas: అభివృద్ధి పనులపై ఆరా.. వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమావేశమైన పొంగులేటి
Ponguleti Srinivas: పేదలకు మౌలిక సదుపాయాలు కల్పించటమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సత్తుపల్లిలో నియోజకవర్గ స్థాయి అభివృద్ధి పనుల గురించి వివిధ శాఖలకు చెందిన అధికారులతో.. ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ పనులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్ఓఆర్ పట్టాలు పొందిన లబ్ధిదారులను ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫారెస్ట్ అధికారులను మంత్రి ప్రశ్నించారు. నకిలీ విత్తనాలు సరఫరా అవ్వకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.