గ్రూప్-4 అభ్యర్థుల పట్ల మానవత్వం చూపిన పోలీసులు.. ఏడుస్తున్న 3 నెలల పాపను లాలించిన మహిళా పోలీస్

TSPSC Group 4 Exam: అభ్యర్థులకు తోడుగా వచ్చిన వారికి బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ పంపిణీ

Update: 2023-07-01 09:40 GMT

గ్రూప్-4 అభ్యర్థుల పట్ల మానవత్వం చూపిన పోలీసులు.. ఏడుస్తున్న 3 నెలల పాపను లాలించిన మహిళా పోలీస్

TSPSC Group 4 Exam: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీసులు గ్రూప్-4 అభ్యర్థుల పట్ల మానవత్వాన్ని చూపారు. కురవి మండలం పెద్దతండాకి చెందిన జగ్గులాల్, సబితా దంపతులిద్దరు పరీక్ష రాసేందుకు 3 నెలల పాపతో పరీక్షా కేంద్రాని వచ్చారు. అయితే నానమ్మ దగ్గర ఉన్న ఆ పాప ఏడవటం గమనించిన మహిళా కానిస్టేబుల్ శ్రీలత చిన్నారిని అక్కున చేర్చుకుంది. మంచం తెప్పించి చెట్టుకింద పడుకోబెట్టింది. అంతేకాక తొర్రురు పట్టణ కేంద్రంలో 10 పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు అరటిపండ్లు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ అందించి మానవత్వం చాటారు. అది చూసిన జనం వారిని అభినందించారు.

Tags:    

Similar News