Hyderabad: భారీ వర్షాల నేపథ్యంలో ఐటీ కంపెనీలకు సైబరాబాద్‌ పోలీసులు కీలక ఆదేశాలు..

Hyderabad: ఐకియా-సైబర్‌టవర్‌ మధ్య కంపెనీలు మ.3 గంటలకు లాగౌట్‌ చేయాలి

Update: 2023-07-25 13:03 GMT

Hyderabad: భారీ వర్షాల నేపథ్యంలో ఐటీ కంపెనీలకు సైబరాబాద్‌ పోలీసులు కీలక ఆదేశాలు.. 

Hyderabad: భారీ వర్షాల నేపథ్యంలో ఐటీ కంపెనీలకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. రెండ్రోజులపాటు ఐటీ ఆఫీస్‌ వేళలు మార్చుకోవాలని సూచించారు. ఈ మేరకు ఐటీ కంపెనీల లాగౌట్‌ సమయాలను నిర్దేశించారు పోలీసులు. ఐకియా-సైబర్‌టవర్‌ మధ్య కంపెనీలు మ.3 గంటలకు లాగౌట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక బయో డైవర్సిటీ, రాయదుర్గం పరిధి కంపెనీలు సాయంత్రం 4.30 గంటలకు.. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, గచ్చిబౌలిలోని కంపెనీలు.. సాయంత్రం 6 గంటలకు లాగౌట్‌ చేసుకోవాలని సైబరాబాద్‌ పోలీసుల ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News