Nizamabad: ఇందల్వాయి జాతీయ రహదారిపై దొంగలపై పోలీసుల కాల్పులు

Nizamabad: ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్‌ వైర్లను దొంగిలిస్తున్న రాజస్థాన్ ముఠా

Update: 2023-05-29 12:17 GMT

Nizamabad: ఇందల్వాయి జాతీయ రహదారిపై దొంగలపై పోలీసుల కాల్పులు

Nizamabad: నిజామాబాద్‌లో దొంగలపై పోలీసులు కాల్పులు జరిపారు. ఇందల్వాయి మండలం జాతీయ రహదారిపై దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వారు పారిపోతుండగా దొంగలపై కాల్పులు జరిపారు.

రాజస్థాన్‌కు చెందిన ముఠాను పట్టుకునేందుకు పోలీసులు కాపు కాశారు. ఈ క్రమంలో దొంగల ముఠా.. పోలీసుల కారును ఢీకొట్టి పారిపోయింది. దీంతో, వారిని పట్టుకునేందుకు పోలీసులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ దొంగల ముఠా.. ట్రాన్స్‌ఫార్మర్‌లోని కాపర్‌ వైర్లను దొంగలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు ముమ్మరం చేశారు. 

Tags:    

Similar News