Hyderabad: హైదరాబాద్‌లో రూ.468.02 కోట్ల విలువ చేసే డ్రగ్స్ ధ్వంసం
Hyderabad: విదేశాల నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా
Hyderabad: హైదరాబాద్‌లో రూ.468.02 కోట్ల విలువ చేసే డ్రగ్స్ ధ్వంసం
Hyderabad: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ ను ధ్వంసం చేశారు పోలీసులు. ఏకంగా 469 కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాలను ధ్వంసం చేశారు. పలు దాడుల్లో కస్టమ్స్ మరియు రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్వాధీనం చేసుకున్న 216 కిలోల డ్రగ్స్ ను ధ్వంసం చేశారు. ఇందులో హెరాయిన్, మెఫిడ్రోన్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలే కాకుండా.. 40 లక్షల విదేశీ సిగరెట్లు కూడా ఉన్నాయి.
డ్రగ్స్ సరఫరాపై స్పెషల్ ఫోకస్ పెట్టిన హైదరాబాద్ కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ సంవత్సరం.. నైజీరియా, బెనియోనాయిస్, టాంజానియా, సౌతాఫ్రికా లాంటి విదేశాలకు చెందిన వారితో పాటు స్వదేశీయుల్లో కొందరు డ్రగ్స్ అక్రమంగా తరలిస్తుండగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు పట్టుకున్నారు. అయితే పలు సందర్భాల్లో పట్టుకున్న డ్రగ్స్ ను దుండిగల్ లోని హైదరాబాద్ వేస్ట్ మేనేజ్ మెంట్ యూనిట్ కు తరలించారు. అక్కడే పలువురు అధికారుల సమక్షంలో వాటిని ధ్వంసం చేశారు. హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలన్న లక్ష్యంతో అధికారులు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.