Warangal: మేడారం జాతరను విజయవంతం చేద్దాం: కమిషనర్ డా.వి.రవీందర్
ఈ నెల 5 నుండి ప్రారంభం కానున్న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా ట్రాఫిక్ జోన్ ఇంచార్జ్ డా.వి.రవీందర్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని సోమవారం పస్రా పోలీస్ స్టేషన్ అవరణలో ఎర్పాటు చేశారు.
వరంగల్: ఈ నెల 5 నుండి ప్రారంభం కానున్న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా ట్రాఫిక్ జోన్ ఇంచార్జ్ డా.వి.రవీందర్ ట్రాఫిక్ సెక్టార్ ఇంచార్జ్ పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని సోమవారం పస్రా పోలీస్ స్టేషన్ అవరణలో ఎర్పాటు చేశారు. ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డిఎస్పీ, ఇన్స్‌పెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం వాహనాలను నియంత్రించడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సెక్టర్ ఇంచార్జ్ అధికారులకు వరంగల్ పోలీస్ కమిషనర్ పవర్ పాయింట్ ద్వారా తెలియజేప్పారు.
ముఖ్యంగా ఈ సమావేశంలో మేడారం ప్రయివేట్, ఆర్టీసీ బస్సులు, వచ్చి పోయో మార్గాల సమాచారాన్ని పోలీస్ కమిషనర్ తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోరకు అధికారులు ముఖ్యంగా వాహనాలు రోడ్డుకు ఇరువువైపుల నిలపకుండా జాగ్రత్త పడాలి. రోడ్దుపై వాహనాలను పార్కింగ్ చేయకుండా, హోల్డింగ్ ప్రాంతాల్లో పార్కింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఒక వేళ రోడ్డు పై వాహనాలు జామ్ అయితే అధికారులు తక్షణమే వాహనాలను హోల్డింగ్ పాయింట్లకు తరలించాలి. ములుగు ఎస్పీ చోరవతో గట్టమ్మగుట్ట వద్ద ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది.
కావున ఇక్కడ విధులు నిర్వహించే అధికారులు వాహనాలు రోడ్డుపై పార్కింగ్ చేయకుండా ప్రత్యేకంగా ఎర్పాటు చేసిన పార్కింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. వాహనాల పార్కింగ్ విషయానికి వస్తే వరంగల్, కరీంనగర్, చత్తీస్‌గఢ్ నుండి వచ్చే వాహనాలను సూచించిన పార్కింగ్ స్థలాల్లో వాహనాలను క్రమపద్దతిలో పార్కింగ్ చేసేవిధంగా చూడాలి. అదే విధంగా పార్కింగ్ స్థలాల్లో సరైన లైటింగ్ వుందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ములుగు ఎస్పీ సంగ్రాం సింగ్ జి. పాటిల్, మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి, ఖమ్మం కమిషనర్ తాసిల్ ఇక్బాల్ పాల్గోన్నారు.