Attapur: హీరోయిజం అనుకున్నారు.. పోలీసులు సీన్ రివర్స్ చేశారు!
Attapur: హైదరాబాద్ అత్తాపూర్‌లో పోలీసు వాహనం ముందే బైక్ స్టంట్లు చేసిన యువకులను పోలీసులు వెంటాడి పట్టుకున్నారు.
Attapur: హీరోయిజం అనుకున్నారు.. పోలీసులు సీన్ రివర్స్ చేశారు!
హైదరాబాద్: అత్తాపూర్ పరిధిలో ఇద్దరు యువకులు పోలీసులకే సవాల్ విసిరారు. రక్షక్ పోలీస్ వాహనం ముందే ప్రమాదకర స్టంట్‌లు చేశారు. ఇదే సమయంలో మరో వ్యక్తి పోలీస్ వాహనం వచ్చేలా వీడియోను రికార్డ్ చేశాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటాడి యువకులను పట్టుకున్నారు. అనంతరం డీసీపీ సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి హెచ్చరించారు. పోలీసుల వాహనం ముందే స్టంట్‌లు చేయడం, వీడియోలు తీసి ప్రచారం చేయడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.