Khammam: డ్రోన్ కెమెరాతో లాక్ డౌన్ అమలు పరిశీలన: పోలీసులు

Update: 2020-04-26 13:43 GMT

ఖమ్మం: పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు ఖమ్మం త్రీ టౌన్ సిఐ శ్రీధర్ ఆధ్వర్యంలో లాక్ డౌన్ అమలు తీరును, రద్దీ వున్న ప్రాంతాలను డ్రోన్ కెమెరాతో పర్యవేక్షించారు. డ్రోన్ కెమెరా సహకారంతో ఎక్కువ రద్దీ వున్న ప్రదేశాలను గుర్తించి సమీపంలో గస్తీ నిర్వహిస్తున్న బ్లూ కోల్డ్స్, పెట్రోకార్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆయా దుకాణాల వద్ద సామాజిక దూరం, మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టారు.

వైరస్ వ్యాప్తిని నియంత్రణలో భాగంగా మార్కెట్ల వద్ద దుకాణాలలో గుంపులుగా చేరకుండా లాక్ డౌన్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ద్విచక్ర వాహనాలపై ఒక్కరే ప్రయాణం చేయాలని,చిన్న చిన్న అవసరాల కోసం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకొవాలని సూచించారు. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే ఆవకాశం వుంది కాబట్టి ఎక్కువగా రద్దీగా వుండే ప్రాంతాలకు వెళ్లకుండా వుంటే మంచిదని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. డ్రోన్ కెమెరా టెక్నికల్ టీమ్ ఉమాకాంత్, సైదా బృందం ప్రతిరోజూ డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ వుంటుందని సిఐ శ్రీధర్ తెలిపారు.


Tags:    

Similar News