మారుతి నగర్ లో పోలిసుల తనిఖీలు
నగరంలోని మారుతి నగర్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు.
కరీంనగర్ టౌన్: నగరంలోని మారుతి నగర్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. త్రీటౌన్ లిమిట్స్ లోని మారుతి నగర్, అంబా భవాని టెంపుల్ ఏరియాలో ఉదయం 5:30 నుండి కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు సంచరించిస్తే పోలీసులకు తెలియజేయాలని, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేసిన అరెస్టు చేయడం జరుగుతుందని తెలిపారు. కూడలిలో అవగాహన కార్యక్రమం నిర్వహించి, మహిళల భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, హాక్-ఐ ఆప్ గురించి వివరించారు.
సమాజంలో మహిళల పట్ల గౌరవ భావంతో మెలగాలని, వేధింపులు చేయకూడదని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీసులు ప్రతి ఇంటిని సోదా చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను, అనుమానం ఉన్న వస్తువులను పూర్తిగా పరిశీలించిన మీదటే వారికి అప్పగిస్తామని తెలిపారు. ఈ కార్డెన్ సెర్చ్ ప్రోగ్రాంలో ఇన్స్పెక్టర్లు, వంద మంది వరకు కానిస్టేబుళ్లు, ఏసీపీలు, సీపీ పాల్గొన్నారు.