పోలవరం-నల్లమల సాగర్‌పై సుప్రీం మెట్లెక్కిన తెలంగాణ.. ఏపీ ప్రాజెక్టుల విస్తరణపై నేడు విచారణ
Polavaram-Nallamala Sagar Dispute: గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటానికి సిద్ధం అయ్యింది.
Polavaram-Nallamala Sagar Dispute: గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటానికి సిద్ధం అయ్యింది. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ చేపట్టనున్నది. పోలవరం ప్రాజెక్టు విస్తరణ పేరుతో ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పనులను తాము అంగీకరింతచలేదంటూ సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ బలమైన వాదనలు వినిపించనున్నది.
ఆమోదించిన అసలు డిజైన్ ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నల్లమల సాగర్ ప్రాజెక్టు నివేదికలను పరిశీలించడాన్ని తెలంగాణ సర్కార్ పిటిషన్ లో తప్పు పట్టింది. కేంద్ర జల సంగం మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించి డీపీఆర్ సిద్ధం చేస్తుందని తెలిపింది.
ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముంబైలో సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీతో చర్చించారు. కోర్టులో తెలంగాణ తరపున సమర్ధవంతమైన బలమైన వాదనలు వినిపించాలని కోరారు. అవసరమైన అన్ని పత్రాలు, ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం కార్యాలయం అప్రమత్తం చేసింది.