Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంకోర్టులో హరీశ్‌రావుకు ఊరట

Phone Tapping Case: తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో మాజీ మంత్రి టి. హరీశ్‌రావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

Update: 2026-01-05 06:20 GMT

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంకోర్టులో హరీశ్‌రావుకు ఊరట

Phone Tapping Case: తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో మాజీ మంత్రి టి. హరీశ్‌రావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్‌ బీవీ నాగరత్న ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.

ఈ వ్యవహారంలో గతంలోనే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే, గతంలోనే ఇదే తరహా పిటిషన్లను తాము కొట్టివేసినట్లు జస్టిస్‌ బీవీ నాగరత్న ధర్మాసనం గుర్తుచేసింది. హరీశ్‌రావు, రాధాకిషన్‌రావుల పిటిషన్ల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి బలమైన కారణాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో లోతైన విచారణ జరిపించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నిర్ణయం ఒక రకంగా ఎదురుదెబ్బగా మారింది. హైకోర్టు ఇచ్చిన వెసులుబాటును సుప్రీం కోర్టు కూడా సమర్థించడంతో, ప్రస్తుతానికి ఈ ఇద్దరు ప్రముఖులకు ఈ కేసులో ఊరట లభించినట్లయింది.

Tags:    

Similar News