Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు‎లో స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు అరెస్ట్ వారంట్

Phonetapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు నాంపల్లి కోర్టు శుక్రవారం నాడు అరెస్ట్ వారంట్ జారీ చేసింది.

Update: 2024-05-10 12:37 GMT

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు‎లో స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు అరెస్ట్ వారంట్

Phonetapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు నాంపల్లి కోర్టు శుక్రవారం నాడు అరెస్ట్ వారంట్ జారీ చేసింది. హైద్రాబాద్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో హైద్రాబాద్ పోలీసులు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పేరును నిందితుడిగా చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ పై హైద్రాబాద్ పంజాగుట్టలో ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. అదే సమయంలో ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్లారు. ఆరోగ్య సమస్యలతో చికిత్స కోసం అమెరికాకు వెళ్ళినట్టుగా కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో ప్రభాకర్ రావు పేర్కొన్నారు.

ఈ కేసు నమోదైన తర్వాత ప్రభాకర్ రావు దర్యాప్తు సంస్థలకు అందుబాటులో లేరు. ఈ విషయమై పోలీసులు తొలుత లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. అయితే రెడ్ కార్నర్ నోటీసులపై ప్రభాకర్ రావు తన న్యాయవాది ద్వారా అఫిడవిట్ సమర్పించారు.ఈ అఫిడవిట్ లో పలు అంశాలను ప్రస్తావించారు. అప్పటి పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే తాను విధులు నిర్వహించిన విషయాన్ని ఆయన ఆఫిడవిట్ లో పేర్కొన్నారు.తనను అరెస్ట్ చేయవద్దని ఆఫిడవిట్ ద్వారా కోర్టును అభ్యర్ధించారు.

అయితే ఇవాళ ఇదే విషయమై నాంపల్లి కోర్టు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో శ్రవణ్ రావును కూడా నాంపల్లి కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేసింది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై తొలుత ఎస్ఐబీలో పనిచేసిన ప్రణీత్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రణీత్ రావు ఇచ్చిన వాంగ్మూలం మేరకు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు పేరును పోలీసులు చేర్చారు.

అప్పటికే క్యాన్సర్ చికిత్స కోసం ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లారు. దీంతో ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.ఈ క్రమంలోనే అరెస్ట్ కు కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల అభ్యర్థనలకు కోర్టు సానుకూలంగా ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News