Ponguleti Srinivasa Reddy: కాంగ్రెస్ 72 నుంచి 78సీట్లు గెలవబోతుంది
Ponguleti Srinivasa Reddy: తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను కోరుకుంటున్నారు
Ponguleti Srinivasa Reddy: కాంగ్రెస్ 72 నుంచి 78సీట్లు గెలవబోతుంది
Ponguleti Srinivasa Reddy: ఖమ్మం రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. పొత్తులో భాగంగా ఒక్కటైన.. కాంగ్రెస్, సీపీఐ నేతలు విజయం కోసం కలిసి వ్యూహాలు రచిస్తున్నారు. కొత్తగూడెం కాంగ్రెస్ కార్యాలయంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో..కొత్తగూడెం సీపీఐ అభ్యర్తి కూనంనేని సాంబశివరావు భేటీ అయ్యారు. కమ్యూనిస్టులతో పొత్తు వల్ల జరిగే లాభ నష్టాలను కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్టు పొంగులేటి తెలిపారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో 72 నుంచి 78సీట్లు గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మీరు అభిమానించే శీనన్న ఒక ఉన్నతమైన పొజిషన్‌లో ఉండబోతున్నాడని కార్యకర్తలను ఉద్దేశించి పొంగులేటి వ్యాఖ్యానించారు.