Hyderabad: వర్షలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ ప్రజలు.. ట్రాఫిక్‌లో లోనే గంటల కొద్ది ఎదురుచూపులు

Hyderabad: ట్రాఫిక్ కష్టాలు తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్న ప్రజలు

Update: 2023-07-25 07:20 GMT

Hyderabad: వర్షలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ ప్రజలు.. ట్రాఫిక్‌లో లోనే గంటల కొద్ది ఎదురుచూపులు

Hyderabad: హైదరాబాద్‌లో వర్షం ఆగడం లేదు. నిన్న సాయంత్రం కురిసిన వర్షానికే రోడ్లు జలమయం అయ్యాయి. ఇవాళ ఉదయం నుంచి మళ్లీ వర్షం మొదలైంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిన్న సాయంత్రం కురిసిన భారీ వానకు గ్రేటర్‌లోని ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్​కారణంగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఇవాళ ఉదయం సైతం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఐటీ కారిడార్‌లో వాటర్​లాగింగ్ పాయింట్ల వద్ద భారీగా వర్షపు నీరు చేరింది. ఉద్యోగులు, విద్యార్థులు వివిధ పనులపై బయటకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారులు వాహనాలతో నిండిపోయాయి. కిలోమీటర్ దూరానికి దాదాపు గంటకుపైగా టైమ్ పట్టింది.

 బయో డైవర్సిటీ నుంచి జేఎన్టీయూ వెళ్లే దారిలో, సైబర్ టవర్స్, గచ్చిబౌలి, విప్రో, లింగంపల్లి, నల్లగండ్ల, ఖాజాగూడ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీ నెలకొంది. హైటెక్​సిటీ, నానక్​రాంగూడలోని ఐటీ ఎంప్లాయీస్ ఇండ్లకు చేరుకునేందుకు నిన్న సాయంత్రం దాదాపు 2 నుంచి 3 గంటల టైమ్ పట్టింది. పంజాగుట్ట, బంజారాహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, కూకట్​పల్లి, సనత్​నగర్, అమీర్ పేట, మెహిదీపట్నం, అశోక్‌నగర్‌, సికింద్రాబాద్‌ మణికొండ, నార్సింగి సహా సిటీ శివారు ప్రాంతాలైన ఎల్​బీనగర్, వనస్థలిపురం, విజయవాడ హైవేపై వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ట్రాఫిక్ సమస్యలపై మంత్రి కేటీఆర్ స్పందిచారు. సిటీలో ట్రాఫిక్ కష్టాలు తగ్గేవిధంగా శాశ్వత పరిష్కారం చూపాలని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును పెంచాలని పలువురు నెటిజన్లు మంత్రిని ఇవాళ ప్రశ్నించారు. వచ్చే కేబినెట్‌లో హైదరాబాద్ మెట్రో రైలు పొడిగింపు అంశాన్ని ప్రధానంగా తీసుకున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే ఈ సమస్యలపై సీఎం కేసీఆర్ తమ శాఖను ఆదేశించారని, ప్రస్తుతం ఆ పనుల్లోనే ఉన్నామని పేర్కొన్నారు. సస్టైనబుల్ మొబిలిటీ, షేర్డ్ మొబిలిటీ మాత్రమే అవసరమైన వృద్ధి, మౌలిక సదుపాయాల మధ్య సమతుల్యతను కొనసాగించడానికి ఏకైక పరిష్కారమని తెలిపారు.

Tags:    

Similar News